సంగారెడ్డి టౌన్, వెలుగు: బీసీలకు రాజకీయ, విద్య , ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సంగారెడ్డి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష చేపట్టారు . జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్, బీసీ జేఏసీ ముఖ్య సలహాదారు అశోక్ కుమార్ మాట్లాడుతూ కేంద్రం 42 శాతం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీల న్యాయమైన డిమాండ్లకు బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ధర్మదీక్షలో వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, శ్రీధర్, మహేంద్ర, సాయిలు, మల్లికార్జున్ పాటిల్, వెంకట కిషన్, మహేశ్ కుమార్, మానస, మంగమ్మ, శ్రుతి, వీరమని, శ్యామల, నిర్మల, మంజుల పాల్గొన్నారు.
