పనికి మాలిన సైట్లతో రెవెన్యూ ఉద్యోగుల మీద పనిభారం మోపుతున్నారు : తహశీల్దార్

V6 Velugu Posted on Nov 05, 2019

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి మృతిపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయా రెడ్డి మృతి పట్ల  సంగారెడ్డి జిల్లా కంది తహశీల్దార్ సరస్వతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  విజయా రెడ్డి మరణంపై కన్నీటి పర్యంతమైన సరస్వతి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.  ప్రభుత్వం పనికిమాలిన సైట్లు పెట్టి రెవెన్యూ ఉద్యోగుల మీద పనిభారం మోపుతున్నారని మండిపడ్డారు. చేతితో రాసినప్పుడు  రైతులకు పాస్ బుక్ లు అందలేదా ? అని ప్రశ్నించారు. వెబ్ సైట్లతో  రెవెన్యూ ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న సరస్వతి.. తీవ్ర ఒత్తిడి తో రాత్రి 10 గంటల వరకు ఆఫీస్ లోనే ఉండి పని చేయాల్సి వస్తుందన్నారు. ఇంటికి పోయే వరకు భయం..భయంగా గడుపుతున్నట్లు సరస్వతి తెలిపారు.

Tagged Rangareddy district, Abdullapurmet, abdullapurmet tahsildar vijaya reddy died, sangareddy district kandi tahsildar saraswati

Latest Videos

Subscribe Now

More News