
జహీరాబాద్, వెలుగు: ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న రెండు ప్రైవేట్ హాస్పిటల్స్‌ను సంగారెడ్డి డీఎంహెచ్‌వో గాయత్రీ దేవి సీజ్ చేశారు. గురువారం సాయంత్రం జహీరాబాద్ పట్టణంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సుభాష్ గంజిలో ఉన్న చందు పాలీ క్లినిక్‌ను విదేశాల్లో మెడిసిన్ చదివిన డాక్టర్ రమేశ్ అనుమతులు లేకుండా నడుపుతున్నట్లు గుర్తించారు. అలాగే అనురాగ్ థియేటర్ సమీపంలో ఉన్న గ్రేస్ హాస్పిటల్‌లో పర్మిషన్ లేకుండా చికిత్సలు చేస్తుండడంతో ఈ రెండింటిని సీజ్ చేశారు.