Raakaasaa Glimpse: మ్యాడ్ తరువాత మరో మ్యాజిక్? ‘రాకాస’లో సంగీత్ శోభన్ కామెడీ అటాక్

Raakaasaa Glimpse: మ్యాడ్ తరువాత మరో మ్యాజిక్? ‘రాకాస’లో సంగీత్ శోభన్ కామెడీ అటాక్

‘మ్యాడ్’ ఫ్రాంచైజీతో  ఆకట్టుకున్న సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాకాస’. మానస శర్మ దర్శకత్వంలో  నిహారిక కొణిదెల,  ఉమేష్ కుమార్ బ‌‌‌‌న్సాల్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో తనదైన కామెడీ టైమింగ్‌‌‌‌తో మెప్పించాడు సంగీత్ శోభన్.

‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను చేధించడానికి  ఓ వీరుడు పుడతాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు.. ఈ కథలో ఆ వీరుడు నేనే’ అంటూ ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ గ్లింప్స్ సాగింది.

ALSO READ : రూ.200 కోట్ల బడ్జెట్ గాసిప్‌కు చెక్.. 

అయితే ఆ తరువాత ఒక్కసారిగా అది కామెడీ, సెటైరికల్ టర్న్ ఇచ్చుకుంది. సంగీత్ భయపడుతూ కనిపించడం ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా ఉంది. నయన్ సారిక హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  వెన్నెల కిషోర్‌‌‌‌, బ్రహ్మాజీ, త‌‌‌‌నికెళ్ల భ‌‌‌‌ర‌‌‌‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌‌‌‌ప్ శ్రీను, వాసు ఇంటూరి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది.