ట్రోలింగ్ పై సానియా ట్వీట్ : ఫిబ్రవరి 14 దేశానికి ‘బ్లాక్‌‌‌‌ డే’

ట్రోలింగ్ పై సానియా ట్వీట్ : ఫిబ్రవరి 14 దేశానికి ‘బ్లాక్‌‌‌‌ డే’

పుల్వామా టెర్రరిస్టు దాడి జరిగిన ఫి బ్రవరి 14 దేశానికి ‘బ్లాక్‌‌‌‌ డే’అని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని టెన్నిస్ ​స్టార్ సా నియా మీర్జా తెలిపింది.  దాడిలో అమరులైన CRPF జవాన్ల కుటుంబాలకు ఆమె సానుభూతి తెలిపింది. ఈ అంశాన్ని ముడి పెట్టి సోషల్‌‌‌‌ మీడియాలో తనను ట్రోల్‌‌‌‌ చేస్తున్న వారికి రిప్లై ఇచ్చింది. పాకిస్తాన్‌ క్రికెటర్‌‌‌‌ షోయబ్‌ మాలిక్‌‌‌‌ను పెళ్లాడిన సానియా.. టెర్రర్ అటాక్ పై సో షల్ మీడియాలో స్పందించకపోవడంతో కొంతమంది ఆమెపై ట్రోలింగ్‌‌‌‌కు దిగారు. దీనిపై సా నియా ఆదివారం ట్విట్టర్‌‌‌‌లో తన అభిప్రాయాలను తెలుపుతూ ట్వీట్ చేసింది.  ‘ఏదైనా ఘటన జరిగిన వెంటనే సెలబ్రిటీలుగా మేం దాన్ని ఖండించాలనుకునే వారి కోసం ఈ

పోస్ట్‌‌‌‌ పెడుతున్నా. మీ వ్యక్తి గత అసహనం, ఆగ్రహం మాపై తీర్చుకోవడం ఎంత వరకు సబబు? ప్రపంచంలో ఉగ్రవాదానికి స్థానం లేదు. నేనెప్పుడూ టెర్రరిజానికి వ్యతిరేకినే. దాడిలో ప్రా ణాలు కోల్పోయిన CRPF జవాన్ల వెంట ఉంటా. వాళ్లే అసలైన హీరోలు. ఫిబ్రవరి 14 దేశానికి ‘బ్లాక్‌‌‌‌ డే’. ఇలాంటి రోజు మరొకటి రాకూడదని కోరుకుం టున్నా. ’ అని  ట్వీట్ చేసింది సానియా.