సంజయ్ దత్ హీరోగా నైంటీస్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఖల్ నాయక్’ కు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. అది కూడా అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ‘చోలీ కే పీచే క్యా హై’ సాంగ్‌కు రీమిక్స్ కావడం విశేషం. సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ, మాధురీ దీక్షిత్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటను ఆల్-టైమ్ క్లాసిక్‌గా నిలబెట్టాయి. రాజస్థానీ జానపద శైలిలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ కంపోజ్ చేసిన ఈ పాటకు ఆనంద్ బక్షి సాహిత్యం అందించారు.
అయితే డబుల్ మీనింగ్స్‌తో కూడిన ఈ పాట లిరిక్స్ అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినా ఇప్పటికీ ఈ పాటకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. రెండేళ్ల క్రితం కూడా ‘క్రూ’ సినిమా కోసం ఈ పాటను రీమిక్స్ చేశారు. ‘ఖల్ నాయక్’ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించిన ఈ పాటను ఇప్పుడు సీక్వెల్ కోసం రీమిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే తమన్నా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరి మాధురి దీక్షిత్ స్థాయిలో తమన్నా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి!

