Asia Cup 2025: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచినా పాకిస్థాన్‌పై కుల్దీప్ ఆడడు: భారత మాజీ క్రికెటర్

Asia Cup 2025: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచినా పాకిస్థాన్‌పై కుల్దీప్ ఆడడు: భారత మాజీ క్రికెటర్

ఆసియా కప్ లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. బుధవారం (సెప్టెంబర్ 10) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును తన స్పిన్ వలలో పడేశాడు. కుల్దీప్ ధాటికి ఆతిధ్య జట్టు యూఏఈ కోలుకోలేకపోయింది. ఓవరాల్ గా 2.1 ఓవర్లలో 7 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ తో ఆకట్టుకున్న కుల్దీప్ పై ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ హాట్ కామెంట్స్ చేశాడు. 

"ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసినా కుల్దీప్ పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోవచ్చు". అని సంజయ్ మంజ్రేకర్ తన ఎక్స్ లో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మంజ్రేకర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ఇతను చెప్పిన మాట కూడా నిజమయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్ తో టీమిండియా సెప్టెంబర్ 14 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ కు ఛాన్స్ దక్కితే కుల్దీప్ లేదా వరుణ్ చక్రవర్తిలో ఒకరు బెంచ్ కు పరిమితం కాక తప్పదు. తన మిస్టరీ స్పిన్ తో ఇటీవలే సంచలనంగా మారిన వరుణ్ ను తప్పించే సాహసం టీమిండియా చేయకపోవచ్చు. అదే జరిగితే మంజ్రేకర్ చెప్పినట్టు కుల్దీప్ పై వేటు తప్పదు. 

►ALSO READ | Women's ODI World Cup: ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం.. వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారి అందరూ మహిళా అధికారులే

విన్నింగ్ కాంబినేషన్ తో వెళ్తే మాత్రం అర్షదీప్ మరోసారి నిరాశే మిగలనుంది. బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబేలు జట్టులో ఉండడం ఖాయం. ఈ మ్యాచ్ విషయానికి వస్తే యూఏఈతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. టీమిండియా ధాటికి ఆతిధ్య జట్టుకు ఘోర పరాభవమే మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇండియా 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.