బీజేపీది అహంకారం: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

బీజేపీది అహంకారం: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించడాన్ని తప్పుపట్టారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఇది బీజేపీ అహంకారానికి నిదర్శనమన్నారు సంజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేయడమంటే మహరాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనన్నారు. బీజేపీ ప్రతిపక్షంలో కూర్చునేందుకైనా సిద్ధపడింది కానీ ఎన్నికలకు ముందు శివసేనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదన్నారు. గవర్నర్ మరికొంత సమయం ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలవుతుందన్నారు సంజయ్. బీజేపీకి 72 గంటల సమయం ఇచ్చారన్న సంజయ్…శివసేన కు తక్కువ సమయం కేటాయించారని అన్నారు. ఇది మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ వ్యూహంలో భాగమేనన్నారు.