పంత్ కోసం సంజూ శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారు

పంత్ కోసం సంజూ శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారు

టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్కు మరోసారి మొండి చెయ్యే ఎదురైంది. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో తుది జట్టులో చోటు దక్కించుకోని సంజూ శాంసన్..న్యూజిలాండ్తో మొదలైన వన్డే సిరీస్లో తొలి వన్డేలో ఆడాడు. ఆ మ్యాచ్ లో 36 పరుగులతో పర్వాలేదనిపించాడు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే మన బౌలర్లు విఫలమవడం, కివీస్ బ్యాట్స్మన్ రాణించడంతో ఫస్ట్ వన్డేలో టీమిండియా ఓడిపోయింది. అయితే తొలి వన్డేలో మోస్తరుగా రాణించినా..రెండో వన్డేలో సంజూ శాంసన్పై టీమ్ మేనేజ్మెంట్ మరోసారి వేటు వేసింది. 

నిలకడగా ఆడినా...

సంజూ శాంసన్ గత కొన్ని రోజులుగా నిలకడగా రాణిస్తున్నాడు. చివరి పది వన్డే ఇన్నింగ్స్లు గమనిస్తే సంజూ రెండు సెంచరీలు సాధించాడు. అలాగే మూడు సార్లు 30 ప్లస్ స్కోరు సాధించాడు. అటు చివరి 10 టీ20లు గమనిస్తే ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. రెండు సార్లు 30 ప్లస్ స్కోరు సాధించాడు. అయితే అతనికి తుది జట్టులో మాత్రం స్థానం దక్కడం లేదు. 

పంత్ కోసమేనా..?

ఫాంలో ఉన్న సంజూశాంసన్కు సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. కానీ..ఇక్కడ రివర్స్..ఫాంలో ఉన్న శాంసన్ను కాదని..ఫాంలేమితో తంటాలు పడుతున్న పంత్కు అవకాశాలు ఎక్కువ దక్కుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీసీసీఐ క్రికెట్ నిపుణులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంత్ కోసం సంజూ కెరీర్ నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. చెత్తగా ఆడుతున్న వారికి ఇంకెన్ని అవకాశాలు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.