మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబురం

మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబురం

మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఈ వేడుకలను చూసేందుకు శనివారం సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరులు, కొమ్మదాసరులు, సొదమ్మ, పిట్టల దొర వంటి కళాకారులు తన ఆట పాటలు, విన్యాసాలను ప్రదర్శించారు. అంతరించిపోతున్న తెలుగు కళారూపాలను చూసి సందర్శకులు సంబురపడ్డారు. అనంతరం యాంఫీ థియేటర్​లో నిర్వహించిన భరతనాట్యం, ఒడిస్సీ నృత్యం ఆకట్టుకుంది.

భోగి పండుగను పురస్కరించుకొని ఆదివారం చిన్న పిల్లలకు భోగి పండ్ల ఉత్సవం నిర్వహిస్తున్నట్లు శిల్పారామం నిర్వాహకులు తెలిపారు.  కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర దేవస్థానంలో సంక్రాంతి సందర్భంగా చిన్నారులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ 
జగదీశ్వర్ రెడ్డి హాజరై పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్​లు అందజేశారు.