జూనియర్​ కాలేజీలకు జనవరి 13 నుంచి సంక్రాంతి సెలవులు

జూనియర్​ కాలేజీలకు జనవరి 13 నుంచి సంక్రాంతి సెలవులు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని జూనియర్​కాలేజీలకు ఈ నెల 13 నుంచి16 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు ఇంటర్​బోర్డు సెక్రటరీ శృతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 17న కాలేజీలు తిరిగి ఓపెన్​అవుతాయని చెప్పారు. జూనియర్​కాలేజీల్లో ఈ సెలవులు అమలయ్యేలా డీఐఈవోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.