జనవరి 10నుంచి ..సంక్రాంతి సెలవులు..కనుమరోజూ హాలిడే

జనవరి 10నుంచి ..సంక్రాంతి సెలవులు..కనుమరోజూ హాలిడే
  • 10  నుంచి 16 వరకు.. సంక్రాంతి సెలవులు
  • కనుమ రోజు స్కూళ్లకు హాలిడే
  • సవరణ ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ప్రకటించారు. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ క్యాలెండర్​లో 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపారు. అయితే, ఇటీవల ప్రభుత్వం రిలీజ్ చేసిన హాలిడేస్ లిస్టులో 16న కనుమ సందర్భంగా సెలవు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవుల లిస్టు ప్రకటించి వారం రోజులైనా విద్యాశాఖ అధికారులు స్పందించలేదు. దీంతో గత నెల 27న ‘సంక్రాంతి సెలవులపై సందిగ్ధం’ హెడ్డింగ్ తో వెలుగులో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు.. ఈ నెల 16న కనుమరోజు కూడా సెలవు ఇవ్వాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపించగా, ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది. 

ఈ నేపథ్యంలో సోమవారం సంక్రాంతి హాలీడేస్​ రివైజ్డ్ డేట్లను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఈనెల 10 నుంచి 16 వరకు అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. ఈనెల 17న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని పేర్కొన్నారు.