13 నుంచి సంక్రాంతి సెలవులు

13 నుంచి సంక్రాంతి సెలవులు
  • 18 న రీఓపెన్​.. జూనియర్​ కాలేజీలకు 14 నుంచి 16 వరకు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల13 నుంచి17 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. ఈ నెల 18న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఐదు రోజుల పాటు హాలిడేస్​ ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ సెలవులు కేవలం నాన్ మైనార్టీ స్కూళ్లకేనని చెప్పారు.

సంక్రాంతి హాలీడేస్ పెరగనున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విద్యాశాఖ అధికారులు ఖండించారు. ఈ నెల14 నుంచి 16 వరకూ అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది. గురుకులాలకు కూడా13 నుంచే సెలవులు ఉండనున్నాయి.