150 సర్కారు  కాలేజీల్లో సంస్కృతం

150 సర్కారు  కాలేజీల్లో సంస్కృతం

హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యాసంవత్సంలో 150 సర్కారు జూనియర్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజీగా సంస్కృతం సబ్జెక్టును ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్మీడియట్ కమిషనరేట్ ముమ్మరం చేసింది. ఈ పోస్టుల మంజూరు కోసం సర్కారుకు, ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్లకు లేఖలు రాసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జూనియర్ కాలేజీల్లో సంస్కృతం సబ్జెక్టు లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో 163 పోస్టుల భర్తీకి అనుమతించాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్ కోరారు. ఈ పోస్టుల్లో 90% డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో.. 10 శాతం ప్రమోషన్లతో భర్తీ చేయనున్నారు.