నవ్వించడమే టార్గెట్

నవ్వించడమే టార్గెట్

‘ఏక్ మినీ కథ’ తర్వాత సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ కాంబోలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌‌స్ర్కైబ్’. ఈరోజు సినిమా విడుదలవుతోన్న 
సందర్భంగా సంతోష్ ఇలా ముచ్చటించాడు.

‘మేర్లపాక గాంధీ టైమింగ్ నాకు బాగా తెలుసు. ‘ఏక్ మినీ కథ’ టైమ్‌‌లోనే మళ్ళీ వర్క్ చేయాలనుకున్నాం. లక్కీగా తొందరగా కుదిరింది.  కథ చెప్పిన నెల రోజుల్లోనే  షూటింగ్‌‌కి వెళ్ళిపోయాం. నవ్వించడమే టార్గెట్‌‌గా  చేసిన సినిమా ఇది. అలాగే నా ఫేవరేట్ క్యారెక్టర్ కూడా ఇదే.  యూట్యూబర్ విప్లవ్ పాత్రలో కనిపిస్తా.  కెరీర్‌‌‌‌లో మొదటిసారి నా ఏజ్ క్యారెక్టర్ చేశా.  నా మనసుకు చాలా నచ్చింది. ‘ఎక్స్ ప్రెస్ రాజా’లా హైపర్ ఎనర్జిటిక్ క్యారెక్టర్.  చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. ఈ కథ అందరూ రిలేట్ చేసుకునేటట్లు వుంటుంది. మనం ఎక్కడో వెతుకుతాం కానీ మన చుట్టూనే బోలెడు ఆసక్తికరమైన కథలు వున్నాయి. ట్రావెల్ వ్లాగర్  గా మొదలైన కథ యాక్షన్ కామెడీ గా మలుపు తీసుకోవడం చాలా ఎక్సయిటెడ్ గా వుంటుంది. నా నెక్స్ట్ మూవీ 'అన్ని మంచి శకునములే' డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.  అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'కళ్యాణం కమనీయం'లో నటిస్తున్నా.