ఎయిర్పోర్ట్లో సారా.. అభిమాని వింత ప్రవర్తన

ఎయిర్పోర్ట్లో సారా.. అభిమాని వింత ప్రవర్తన

బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ ను ముంబై ఎయిర్ పోర్టులో వింత సంఘటన ఎదురైంది. అభిమాని చేసిన ఆ వింత ప్రవర్తనకు షాకైన సారాకు ఎం చేయాలో అర్థం కాక పక్కకు జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్స్ కూడా వింతగా రియాక్ట్ అవుతున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సారా అలీ ఖాన్ ఇటీవల ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమె చుట్టూ అభిమానులు గుమిగూడారు. సెల్ఫీలు తీసుకోవడం కోసం ఎగబడ్డారు. సారా కూడా చాలా ఓపికగా అందరికీ సెల్ఫీలు ఇచ్చింది. అందులో చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరికీ కాదనకుండా సెల్ఫీలు ఇచ్చింది ఈ బ్యూటీ. అదే సమయంలో ఓ యువతి  మాత్రం ఫోటో దిగకుండా షేక్ హ్యాండ్ ఇచ్చింది. అలా షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు వెళ్తూ సారా ముఖంతో పాటు ఆమె భుజాలను తాకడానికి ప్రయత్నించింది. ఆమె వింత ప్రవర్తనకు షాకైంది సారా. ఆమె అమ్మాయి వెనక్కి తిరిగి చూడకుండా అలాగే వెళ్ళిపోయింది. సారా కూడా  ఆమెను ఏమనకుండా నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.