ఎస్సీ గురుకుల ఇన్‌‌చార్జి సెక్రటరీగా శారద

ఎస్సీ గురుకుల ఇన్‌‌చార్జి సెక్రటరీగా శారద
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల ఇన్‌‌చార్జ్ సెక్రటరీగా శారదను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ జీవో విడుదల చేశారు. సెక్రటరీ విజయేంద్ర బోయి గత రెండు నెలల నుంచి లీవ్‌‌లో ఉండటంతో  ప్రస్తుతం సోసైటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న శారదకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

రెగ్యులర్ సెక్రటరీ విధుల్లో చేరే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని జీవోలో స్పెషల్ సీఎస్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా శారదకు ఇన్‌‌చార్జ్ సెక్రటరీగా బాధ్యతలు ఇవ్వడంపై గురుకుల అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాన్ గెజిటెడ్  ఆఫీసర్‌‌‌‌ను సెక్రటరీగా ఎలా నియమిస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ  అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు.