అరంగేట్రంతోనే ప్రపంచ రికార్డు సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్

 అరంగేట్రంతోనే ప్రపంచ రికార్డు సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్

అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే టీమిండియా యంగ్ క్రికెటర్  సర్ఫరాజ్ ఖాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.  అరంగేట్రం టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ యాభై ప్లస్ స్కోరు సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా, వరల్డ్ వైడ్ గా 43వ ఆటగాడిగా నిలిచాడు. 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్  ఇంగ్లండ్ తో  రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్ని్ంగ్స్ లో 62  పరుగులు, సెంకడ్ ఇన్నింగ్స్ లో   68 పరుగులు చేశాడు .  

సర్ఫరాజ్ ఏకంగా 94.20 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. ఇది టెస్టు అరంగేట్రంలో రెండు యాభై-ప్లస్ స్కోర్లు చేసిన మొత్తం 43 మంది క్రికెటర్లలో అత్యధికం కావడం విశేషం.  దిలావర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ , శ్రేయాస్ అయ్యర్ తర్వాత రెండు ఇన్నింగ్స్‌లలో యాభైకి పైగా పరుగులు చేసిన నాల్గవ భారతీయుడు సర్ఫరాజ్ ఖాన్. సర్ఫరాజ్ ఖాన్ రెండు ఇన్నింగ్స్‌లలో మొత్తం కలిపి నాలుగు సిక్సర్లు ,15 ఫోర్లు ఉన్నాయి.  

భారత్‌ తరఫున కూడా ఆడాలని కోరుకున్న తన తండ్రి కలను నెరవేర్చానని సర్ఫరాజ్ ఖాన్ మీడియాకు చెప్పాడు. "భారత్‌కు ఆడాలనేది మా నాన్న కల, కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల అది జరగలేదు, అప్పుడు ఇంటి నుండి పెద్దగా మద్దతు లేదు.  నేను టీమిండియా తరుపున ఆడటం  నా జీవితంలో గర్వించదగిన క్షణం," అని చెప్పాడు.