బెంగళూరు: సరిగమప ఫేమ్ సింగర్ సుబ్రమణి భార్య జ్యోతి తన పుట్టింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేఆర్‌పురలోని పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుబ్రమణి కి కోలార్ ధర్మరాయనగర్ కు చెందిన జ్యోతితో 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సరిగమప టీవీ షో ద్వారా పాపులర్ అయిన సుబ్రమణి సింగర్ సుబ్రమణిగా మారాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన పుట్టింటికి వెళ్లిన జ్యోతి నిన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి తాడు బిగుంచుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి తాడు బిగించుకుని స్టూల్ ను తన్నేయగానే శబ్దాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస సంబంధ ఇబ్బంది తలెత్తడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవని చేర్చుకోలేదు. దీంతో హోస్‌కోటలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జ్యోతి తుదిశ్వాస విడిచింది. తన భార్య ఆత్మహత్యపై భర్త సింగర్ సుబ్రమణి మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని, ఆమెకు కరోనా రావటంతోటే భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తెలిపాడు. జ్యోతి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని సమాచారం. కుటుంబ సభ్యులు కూడా ఆమె భర్త గాని మరెవరిపైనా ఆరోపణలు చేయకపోయినా పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు.
