యాక్షన్ మూడ్‌ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు : నాని

యాక్షన్ మూడ్‌ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు : నాని

ఎక్సయిటింగ్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లేతో, అడ్రినలిన్‌‌‌‌‌‌‌‌ పంపింగ్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ‘సరిపోదా శనివారం’ సినిమా ఉంటుందన్నారు హీరో నాని. ఆయన హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు.  ప్రియాంక అరుళ్ మోహన్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్. గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా నాని ఇలా ముచ్చటించారు. 

ఈ సినిమా స్టోరీ లైన్‌‌‌‌‌‌‌‌ ఏమిటో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపించాం.  స్టోరీ విన్నప్పుడు నన్ను ఎక్సయిట్ చేసింది కూడా అదే. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశామనేదే సినిమాలో చూడాలి. సాధారణంగా నా సినిమాల్లో భారమంతా నేనే మోస్తుంటాను.  కానీ ఈసారి పెర్ఫార్మెన్స్ పరంగా ఎస్‌‌‌‌‌‌‌‌జే సూర్య, ప్రియాంక, మురళీశర్మ లాంటి ఇతర పాత్రలపై కూడా ఉంది.  అందుకే నాకిది చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌గా కంటే రిఫ్రెషింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ముఖ్యంగా సూర్య, దయ, చారులత పాత్రల మధ్య జరిగే కథ ఇది.  ఆ కథకు ఎమోషన్ ని యాడ్ చేసేది సోకులపాలెం. సినిమా మొదలైన ఐదు నిమిషాలకే ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో మీకు తెలుస్తుంది.  

అది నా ఫేవరేట్ మూమెంట్ కూడా.  లీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లేతో ఉంటూనే, నెరేటివ్ చాలా ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉండే చిత్రమిది. ఎస్‌‌‌‌‌‌‌‌జే సూర్య గారితో కలసి నటించడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఆ పాత్రకు ఆయన తప్పితే మరో చాయిస్ లేదు. డబ్బింగ్‌‌‌‌‌‌‌‌ కూడా చాలా బాగా చెప్పారు. ఇది చాలా రేసీ ఫిలిం. సినిమా పరిగెడుతుంటుంది. అందుకు తగ్గట్టే జేక్స్ బిజోయ్ ఆర్ఆర్ చేశాడు.  హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌‌‌‌‌‌‌‌కు ఎంత ఎనర్జీ ఉంటుందో అలాంటి మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ను సినిమా మొత్తానికి ఇచ్చాడు.  ఇందులో యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌ ఉండేది ఇరవై శాతమే అయినా యాక్షన్ మూడ్ మాత్రం ఎనభై శాతం ఉంటుంది. అడ్రినలిన్‌‌‌‌‌‌‌‌ పంపింగ్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌ను వందశాతానికి తీసుకెళ్ళాం. దాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’.