సరిపోదా శనివారం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

సరిపోదా శనివారం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్.. ప్రస్తుతం  తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. మరోసారి ఆమె నానితో  కలిసి నటిస్తున్న చిత్రం  ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే నాని లుక్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ఆదివారం ప్రియాంక మోహన్ పాత్రను పరిచయం చేస్తూ.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

ఇందులో ప్రియాంక పోలీస్ గెటప్‌‌‌‌‌‌‌‌లో ఇన్నో సెంట్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తుంది. చారులత పాత్రలో ఆడియెన్స్ ముందుకు రాబో తోందని రివీల్ చేశారు.  ఖాకీ దుస్తులు ధరించి, భుజంపై బ్యాగ్‌‌‌‌‌‌‌‌తో నడుస్తూ చిరునవ్వులు చిందుస్తున్న ప్రియాంక మోహన్ పోస్టర్ ఆకట్టుకుంది.  వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ  దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.  ఎస్‌‌‌‌‌‌‌‌జే సూర్య, సాయి కుమార్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్ట్ 29న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  సినిమా విడుదల కానుంది.