
తండ్రీ కూతుళ్ళ మధ్య బంధాన్ని చూపిస్తూ ‘హాయ్ నాన్న’ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని.. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోయిందా శనివారం’ సినిమాలో నటిస్తున్నాడు నాని. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రామ్ -లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఓ యాక్షన్ షెడ్యూల్‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ను కూడా చిత్రీకరించారు.
బ్యాలెన్స్ షూట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టాలనుకుంటోందట టీమ్. వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో నాని రగ్డ్ లుక్‌లో కనిపించనున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.