అల్మటీ:ఇండియా స్టార్ రెజ్లర్ సరితా మోరె యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. శనివారం జరిగిన 59 కేజీ టైటిల్ ఫైట్‌లో సరిత టెక్నికల్ సుపిరియారిటీతో జలా అలియోవా (అజర్‌బైజాన్)పై నెగ్గింది. ఫైనల్ చేరే క్రమంలో మూడు బౌట్లలో పాల్గొన్న సరిత కేవలం రెండు పాయింట్లే కోల్పోయింది. 65 కేజీ కేటగిరీ ఫైనల్లో మనీషా 8‑0తో ఎలిస్ మనోలోవా (అజర్‌బైజాన్)పై నెగ్గి పసిడి సొంతం చేసుకోగా.. 72 కేజీల్లో బిపాసా సిల్వర్, 55 కేజీల్లో సుష్మ షౌకిన్ బ్రాంజ్ గెలిచారు. మెన్స్ ఫ్రీస్టయిల్ 125 కేజీలో మోహిత్ కాంస్యం నెగ్గాడు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ షురూ
పంచకుల:సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా.. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను శనివారం సాయత్రం ప్రారంభించారు. ఈ నెల 13 వరకు ఈ పోటీలు జరుగుతాయి. దేశ వ్యాప్తంగా 8500 మంది ఇందులో పాల్గొంటున్నారు. ఖేలో ఇండియా కార్యక్రమం నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా క్రీడాకారులకు వేదికను అందించడంలో విజయవంతమైందని షా అన్నారు.

