మంగళవారం ( నవంబర్ 18 ) కాంపస్ లా అసోసియేషన్, తరుణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నేహధార పోక్సో లా సెంటర్ ను వర్చువల్ గా ఇనాగరెట్ చేశారు అడిషనల్ డీజీపీ స్వాతి లక్ర, అంబేద్కర్ లా ఇన్స్టిట్యూట్ కరెస్పాండెంట్ సరోజ వివేక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సరోజ వివేక్. పిల్లలకు గుడ్ టచ్, బాడ్ టచ్ తెలిసేలా పెంచాలని.. ఇప్పటికీ పీరియడ్స్ వంటి విషయాలపై మాట్లాడాలంటే షేమ్ ఫీల్ అవుతున్నామని అన్నారు. ఓపెన్ గా మాట్లాడాలని.. భయం, సిగ్గు అవసరం లేదని అన్నారు సరోజ వివేక్.
కాకా వెంకట స్వామి అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎంతో మంది పేద వారికీ చదువు అందించారని, 75 వేల మందికి హోమ్ కల్పించారని అన్నారు.అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఎంతో మంది పేద పిల్లలు చదువుకుంటున్నారని.. నో ర్యాగింగ్, మెంటల్ వెల్ నెస్ ప్రోగ్రాం అందిస్తున్నామని అన్నారు. మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయని... రిపోర్ట్ అయిన కేసెస్ మాత్రమే కాదు, కానివి ఎన్నో ఉన్నాయని అన్నారు సరోజ వివేక్.
మనం చూసి చూడనట్టు వదిలేయకుండా.. బాధ్యతగా ముందుకెళ్లి కంప్లైంట్ చేయాలని.. లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని అన్నారు సరోజ వివేక్. సొసైటీ రేప్ అయిన విక్టిమ్ ని ఎన్నో అంటుందని.. అమ్మాయి వేసుకొనే బట్టలు, క్యారక్టర్ గురించి తప్పుపడుతారని అన్నారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారు, ముసలి వారు వరకు అత్యాచారానికి గురవుతున్నారని అన్నారు. తెలిసిన వారు, బంధువులు ఎక్కువగా అత్యాచారానికి పాల్పడటం దారుణమని అన్నారు సరోజ వివేక్.
