ప్రశ్నిస్తే బాల్క సుమన్‌ కేసులు పెడుతుండు: సరోజ

ప్రశ్నిస్తే  బాల్క సుమన్‌ కేసులు పెడుతుండు: సరోజ

చెన్నూరు ప్రాంతానికి ఎంపీగా, ఎమ్మెల్యేగా 10 ఏండ్లు పదవిలో ఉన్న బాల్క సుమన్‌‌‌‌.. నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజా వివేక్ అన్నారు. బాల్క సుమన్‌‌‌‌ ఎప్పుడూ ప్రజలను కలవడని, ఎవరైన ఆయనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ రాక్షస ఆనందం పొందారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు. 

భీమారం మండలం కొత్తపల్లి, ఎల్కేశ్వరం, లాల్ బహదూర్ పేట్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆమెకు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. పోడేటి రవితో కలిసి ప్రచారం నిర్వహించారు. ‘‘చెన్నూరు నా రాజ్యం.. ఇక్కడ నేనే రాజు’’అంటూ బాల్క సుమన్‌‌‌‌ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి.. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నరు.. ఎవరు ఎవరిని కలుస్తున్నారో ఆరా తీస్తున్నారన్నారు.

 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, ప్రజలు భయపడొద్దన్నారు. కాంగ్రెస్​ నేతలు కొత్తపల్లి మోహన్ రెడ్డి, అనపర్తి రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, బాపు రెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రకాశ్‌‌‌‌ రెడ్డి, సమ్మయ్య, రాజశేఖర్, బోయిని లక్ష్మణ్, వనపర్తి రమేశ్‌‌‌‌, దుర్గం తిరుపతి, బండం శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అన్నమల్ల అశోక్, సందీప్ పాల్గొన్నారు.