బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సరోజ వివేక్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సరోజ వివేక్

విడిపోయిన బంధాలను కూడా కలిపే పండగే బతుకమ్మ అని విశాక ఇండస్ట్రీస్ ఎండీ, అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్ అన్నారు. ఆలిండియా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో లుంబిని పార్క్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళలు 9 రోజుల పాటు ఎంతో సంబురంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారని సరోజ అన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. 

ప్రస్తుతం దేశవిదేశాల్లోనూ బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్నారని సరోజ వివేక్ అన్నారు. అమెరికాలో మన సంప్రదాయాలు, సంస్కృతులను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇక తెలంగాణ కోసం పోరాటం చేసిన కాకా వెంకటస్వామి స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే కున్నుమూశారని, ఆ ఇంటి కోడలు కావడం తన అదృష్టమని సరోజ వివేక్ అన్నారు.