ఎవరూ సపోర్ట్ చేయట్లేదని.. సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

ఎవరూ సపోర్ట్ చేయట్లేదని.. సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

తెలంగాణ వ్యాప్తంగా స్థానిక ఎన్నికల హడావిడి ఊపందుకుంది. తొలివిడత స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పల్లెల్లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఒక్క ఏకగ్రీవాలతో పలు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనగా.. మిగతా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారాలతో యుద్దవాతావరణం నెలకొంది. 

ఇదిలా ఉండగా.. సిద్ధిపేట జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మంగళవారం ( డిసెంబర్ 2 ) జరిగిన ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎల్లయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పంచాయితీ ఎన్నికల్లో తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని మనస్తాపానికి గురయ్యాడు ఎల్లయ్య. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు ఎల్లయ్య. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఎల్లయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.