తెలంగాణ వ్యాప్తంగా స్థానిక ఎన్నికల హడావిడి ఊపందుకుంది. తొలివిడత స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పల్లెల్లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఒక్క ఏకగ్రీవాలతో పలు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనగా.. మిగతా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారాలతో యుద్దవాతావరణం నెలకొంది. తొలివిడత పంచాయితీ ఎన్నికలు గురువారం ( డిసెంబర్ 11 ) జరగనుండగా.. ఆయా పల్లెల్లో మైకులు మూగబోయాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు. ఇదిలా ఉండగా.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల హామీ కింద ఊళ్ళో వైఫై ఏర్పాటు చేశాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం లంబాడిహెట్టి గ్రామంలోలో గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచ్ గా పోటి చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బాలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. ఊళ్ళో నెట్వర్క్ సమస్యలు ఉండటంతో ఐదు చోట్ల వైఫై ఏర్పాటు చేశాడు.
Also read:- వారాసిగూడ పవిత్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
గ్రామపంచాయతీ పరిధిలో విద్యార్థులకు, యువకులకు నెట్వర్క్ సమస్య వల్ల చాల ఇబ్బందులు ఎదురౌతున్నాయని తన సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా మొదటిది గ్రామంలో వైఫై నెట్వర్క్ ఏర్పాటు చేసాడు స్వాతంత్య్ర అభ్యర్థి బాలు.

