ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో మూడు విడతల్లో పల్లె పోరు

ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో  మూడు విడతల్లో పల్లె పోరు
  • డిసెంబర్‍ 11,14,17 తేదీల్లో సర్పంచ్​ ఎన్నికలు
  • ప్రకటించిన         రాష్ట్ర ఎన్నికల కమిషన్​
  • ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 1,683 గ్రామ పంచాయతీలు
  • అమలులోకి కోడ్​

వరంగల్‍, వెలుగు: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్​ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వెంటనే ఎన్నికల కోడ్​ అమలులోకి వస్తుందని ఎన్నికల కమిషనర్​రాణి కుముదిని తెలిపారు. ఉమ్మడి వరంగల్​జిల్లాలో డిసెంబర్‍ 11, 14, 17 తేదీల్లో సర్పంచ్‍ ఎలక్షన్లు నిర్వహించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 6 జిల్లాల్లో ఎన్నికల కోడ్‍ అమలులోకి వచ్చినట్లయింది. పల్లె ప్రజలు ఓటు ద్వారా తమ సర్పంచులను ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించింది. 

మహబూబాబాద్​ జిల్లాలో ఎక్కువ జీపీలు 

ఉమ్మడి జిల్లాలో 1,683 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మహబూబాబాద్‍ జిల్లాలో అత్యధికంగా 482 జీపీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 146 పంచాయతీల్లో ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంది. ఇందులో కేవలం ఎస్టీలకు మాత్రమే కేటాయించిన 310 జీపీలు ఉండగా.. 210 మందికి డైరెక్ట్​గా అవకాశం రానుంది. నాన్​ షెడ్యూల్డ్​ ఏరియాల్లో 596 జీపీల్లో జనరల్‍ కు ఎక్కువ అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలోని నాన్​ షెడ్యూల్డ్​ఏరియాల్లో బీసీ మహిళలకు 90, జనరల్​కు 113, జనరల్​ మహిళలకు 299, జనరల్​కు 297 సర్పంచ్​ స్థానాలు కేటాయించారు. 

 జిల్లా                   జీపీల        గిరిజన           ఎస్టీ             ఎస్టీ

                            సంఖ్య       గ్రామాలు      మహిళ   జనరల్ 

వరంగల్‍               317               74                     37              37

హనుమకొండ       210               05                     02              03

జనగామ               280               39                      16              23

భూపాలపల్లి         248              07                        02              05

ములుగు              146             100                       47              53

మహబూబా బాద్‍   482             85                       42               43

మొత్తం                1,683            310                     146              164

వరంగల్‍ జిల్లా లోని మండలాలు, పంచాయతీలు

మొదటి విడత

మండలాలు    జీపీలు

వర్ధన్నపేట    18

పర్వతగిరి    33

రాయపర్తి    40

రెండో విడత

దుగ్గొండి    34 

నల్లబెల్లి    29

గీసుగొండ    21

సంగెం    33

మూడో విడత

నర్సంపేట    19

ఖానాపూర్‍    21

చెన్నారావుపేట    30

నెక్కొండ    39

భూపాలపల్లి జిల్లాలోని మండలాలు, పంచాయతీలు

మొదటి విడత

మండలాలు    జీపీలు

ఘన్​పూర్‍    17

కొత్తపల్లిగోరి    16

రేగొండ    23

మొగుళ్లపల్లి     26

రెండో విడత

చిట్యాల    26

టేకుమట్ల    25

భూపాలపల్లి    26

పల్మెర    08

మూడో విడత

మల్హర్‍ రావు    15

మహదేవ్‍పూర్‍    18

మహాముత్తారం    24

కాటారం    24

హనుమకొండ జిల్లా లోని మండలాలు, పంచాయతీలు

మొదటి విడత

మండలాలు    జీపీలు

బీమదేవరపల్లి    25

ఎల్కతుర్తి        20

కమలాపూర్‍    24

రెండో విడత

ధర్మసాగర్    19

హసన్‍పర్తి    15

ఐనవోలు    17

వేలేర్‍    12

పరకాల    10

మూడో విడత

ఆత్మకూర్‍    16

దామెర    14 

నడికూడ    14

శాయంపేట    24

జనగామ జిల్లా లోని మండలాలు, పంచాయతీలు

 

 

 

 

 

 

 

 

 

మొదటి విడత

మండలాలు    జీపీలు

చిల్పూర్‍    17

ఘనపూర్‍ (స్టేషన్‍)    15

రఘునాథపల్లి    36

జఫర్‍గడ్‍    21

లింగాల ఘనపూర్‍    21

రెండో విడత

జనగామ    21

నర్మెట్ట    17

తరిగొప్పుల    15

బచ్చన్నపేట    26

మూడో విడత

దేవరుప్పుల    32

పాలకుర్తి    38

కొడకండ్ల    21

మహబూబాబాద్‍ జిల్లా లోని మండలాలు, పంచాయతీలు

 

మొదటి విడత

మండలాలు    జీపీలు

గూడూర్‍    41

ఇనుగుర్తి    13

కేసముద్రం    29

మహబూబాబాద్‍    41

తొర్రూర్‍    31


రెండో విడత

బయ్యారం    29

చిన్నగూడూర్‍    11

దంతాలపల్లి    18

గార్ల    20

నర్సింహులపేట్‍    23

పెద్దవంగర    26

తొర్రూర్‍    31

మూడో విడత

డోర్నకల్‍    26

గంగారం    12

కొత్తగూడ    24

కురవి    41

మరిపెడ    48

సీరోల్‍    18

ములుగు జిల్లాలోని మండలాలు, పంచాయతీలు

మొదటి విడత

మండలాలు    జీపీలు

తాడ్వాయి    18

ఏటూర్‍నాగారం    12

గోవిందపూర్‍    18

రెండో విడత

మల్లంపల్లి    10

ములుగు    19

వెంకటాపూర్‍    23

మూడో విడత

వెంకటాపురం    18

వాజేడు    17

కన్నాయిగూడెం    11