స్థలం విరాళంగా అందజేసిన సర్పంచ్

స్థలం విరాళంగా అందజేసిన సర్పంచ్

ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్  మండలం పెద్ద వేములోనిబాయి తండాలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సర్పంచ్  గోపి నాయక్  రూ.60 లక్షల విలువైన 600 గజాల స్థలాన్ని గురువారం విరాళంగా అందజేశారు. తండాలో గ్రామపంచాయతీ, డ్వాక్రా, ఇతర భవనాల నిర్మాణానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి సర్పంచ్ గా ఎన్నికైన ఆయన తన కుటుంబ సభ్యులను ఒప్పించి భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

స్థలం విరాళంగా అందజేసిన సర్పంచ్​ను కాంగ్రెస్  నాయకులు సన్మానించి అభినందించారు. పీసీసీ మెంబర్​ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్  హీరా సింగ్, మాజీ సర్పంచ్  శేఖర్ గౌడ్, కార్యదర్శి లక్ష్మణ్  నాయక్  
పాల్గొన్నారు.