
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో చెక్ పవర్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కింద కూర్చొని నిరసన తెలిపారు సర్పంచులు. చెక్ పవర్ లేక గ్రామాల్లో నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చెక్ పవర్ కలిపిస్తే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు.