ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన సర్పంచ్ సస్పెండ్

ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన సర్పంచ్ సస్పెండ్

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెలిమినేడు సర్పంచ్ దేశబోయిన మల్లమ్మను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సర్పంచ్ మల్లమ్మను సస్పెండ్ చేస్తున్నట్లు మండల శాఖ అధ్యక్షుడు జడల ఆది మల్లయ్య ప్రకటించారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు లింగస్వామి, వార్డు మెంబర్ నాతి మంజులను కూడా సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించినందుకు వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనను అకారణంగా సస్పెండ్ చేయించారని నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. ఆమెకు మద్దతుగా టీఆర్ఎస్ వార్డ్ మెంబర్లు కూడా ధర్నాలో పాల్గొన్నారు.