గ్రామస్థుల సమస్యలు తెలుసుకునేందుకు.. గడప గడపకూ సర్పంచ్

గ్రామస్థుల సమస్యలు తెలుసుకునేందుకు.. గడప గడపకూ సర్పంచ్

వికారాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మోమిన్​పేట మండలంలోని కోలుకుంద సర్పంచ్ కరుణం కీర్తి రామకృష్ణ గ్రామస్తుల సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకూ సర్పంచ్​కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఉప సర్పంచ్​మహేందర్​రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి విద్యుత్, నీరు, డ్రైనేజీ తదితర సమస్యలను నోట్​ చేసుకున్నారు. ప్రతీ నెల 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు.