అభివృద్ధిని చూసే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లో చేరికలు : డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సత్యం

అభివృద్ధిని చూసే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లో చేరికలు : డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సత్యం

గంగాధర, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన సర్పంచులు, నాయకులు పార్టీలో చేరుతున్నారని డీసీసీ ప్రెసిడెంట్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ కొలెపాక కవిత- మల్లేశం.. గురువారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ముందుంటుందన్నారు. 

బోయినిపల్లి, వెలుగు: బోయినిపల్లి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు న్యూ ఇయర్ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి విషెస్ చెప్పారు.  విషెష్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వారిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌‌‌‌‌‌‌‌యాదవ్, వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్, సర్పంచులు కనకయ్య, మహేశ్వర్ రెడ్డి, మోహన్ ఉన్నారు.