మెదక్, వెలుగు: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్మద్దతుతో పోటీచేసి గెలుపొందిన పలువురు సర్పంచ్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హవేలీ ఘనపూర్ మండల జక్కన్నపేట సర్పంచ్ చామంతుల సత్యనారాయణ, పోచంరాల్ సర్పంచ్ రాజు, వార్డు మెంబర్లు, అనుచరులతో కలిసి హైదరాబాద్ తరలివెళ్లి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
బీఆర్ఎస్పార్టీకి చెందిన నిజాంపేట మండలం చల్మెడ గ్రామ ఉప సర్పంచ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, పలువురు వార్డు మెంబర్లు హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు అరునార్తి వెంకటరమణ, ఉప్పల రాజేశ్, రాగి అశోక్, చల్మెడ సర్పంచ్ మల్లేశం పాల్గొన్నారు.
