
- ఆ బోటింగ్ కేంద్రాలు సీజ్ చేయండి.
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మండలం సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఇద్దరు మహిళా పర్యాటకులను బలి తీసుకున్న రిసార్ట్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సదరు రిసార్ట్‌ను సీజ్‌చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి గీత డిమాండ్‌చేశారు.
రిసార్టు నిర్వాహకులు ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే జలాశయంలో బోటింగ్ నిర్వహిస్తున్నారన్నారు. అయినా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో అమాయక పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయన్నారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బోటింగ్ కేంద్రాలను సీజ్ చేయాలని ఆదివారం డిమాండ్‌చేశారు.