
కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో పరిధిలో ఇంజనీరింగ్, లా కాలేజీల్లో గెస్టు ఫ్యాకల్టీ(అవర్లీ బేస్డ్/ పేపర్ వైజ్), ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. హుస్నాబాద్ లో ప్రారంభమయ్యే ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ , వర్సిటీ క్యాంపస్ లో ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం కోర్సులను ఈ అకాడమిక్ నుంచి ప్రారంభిస్తున్నారు.
ఆయా కోర్సులు బోధించేందుకు పీజీ, పీహెచ్డీ, యూజీసీ నెట్ /సెట్ క్వాలిఫికేషన్ అర్హత కలిసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని రిజిస్ట్రార్ జాస్తి రవి కుమార్ తెలిపారు.