శాతవాహన వీసీ అమెరికా పర్యటన

శాతవాహన వీసీ అమెరికా పర్యటన

 

  • వర్సిటీ  అభివృద్ధికి విరాళాల సేకరణ

కరీంనగర్ టౌన్,వెలుగు: శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ రెండు వారాల  పర్యటన కోసం శుక్రవారం సాయంత్రం అమెరికా బయల్దేరారు. ఆయన మాట్లాడుతూ... ఒక సెమినార్ లో పాల్గొని,యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రవాస తెలంగాణ వాసుల నుంచి విరాళాలు సేకరించబోతున్నట్లు వెల్లడించారు. 

విశ్వవిద్యాలయ అభ్యున్నతి కోసం  శాతవాహన ఎడ్యుకేషన్ ట్రస్ట్  ఏర్పాటు చేసినట్లు, దానికి అధ్యక్షుడిగా వీసీ వ్యవహరిస్తారని యూనివర్సిటీ ఆర్థిక అవసరాల కోసం  నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. వీసీ పర్యటన ఈ నెల 31తో ముగియనుంది.