పీవోకేలో లష్కరే క్యాంప్!..శాటిలైట్ ఫొటోల్లో గుర్తించిన నిఘా వర్గాలు

పీవోకేలో లష్కరే క్యాంప్!..శాటిలైట్ ఫొటోల్లో గుర్తించిన నిఘా వర్గాలు

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోని వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న లష్కరే తయిబా ట్రెయినింగ్ క్యాంప్ ను భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ‘జంగల్ మంగల్’ అనే పేరుతో పిలిచే ఈ క్యాంపులోనే పహల్గాంలో నరమేధానికి పాల్పడిన టెర్రరిస్టులకు ట్రెయినింగ్ ఇచ్చినట్టుగా అనుమానిస్తున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని మాన్ సెహ్రా జిల్లా, అటర్ సిసా టౌన్ వద్ద మిలిటరీ బిల్డింగులకు సమీపంలో ఈ క్యాంప్ ఉన్నట్టు శాటిలైట్ ఫొటోలను బట్టి నిఘా వర్గాలు గుర్తించాయి.

ఇక్కడ టెర్రరిస్టులకు ట్రెయినింగ్ కోసం ఓపెన్ గ్రౌండ్, బస చేసేందుకు నివాస సముదాయం, మీటింగ్ హాల్స్, ఓ మసీదు కూడా ఉన్నాయి. వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నందున ఈ క్యాంప్ నుంచి భారత్ లోకి టెర్రరిస్టుల చొరబాట్లకు అనుకూలంగా ఉంటుందని, టెర్రరిస్టులపై దాడులు జరగకుండా రక్షణగా ఉండేందుకే మిలిటరీ ప్లేస్ కు దగ్గరలో దీనిని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సైతం తరచూ ఇక్కడకు వచ్చేవాడని నిఘా వర్గాలు గుర్తించాయి.