న్యూఢిల్లీ: ఇండియా బ్యాడ్మింటన్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి.. డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోయారు. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసిన తాజా జాబితాలో ఇండియన్ జోడీ మూడో ర్యాంక్‌కు పడిపోయింది. చైనా ప్లేయర్లు లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ కొత్తగా నంబర్‌వన్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చారు.
మెన్స్ సింగిల్స్‌లో హెచ్.ఎస్. ప్రణయ్, లక్ష్యసేన్ వరుసగా 10, 14వ ర్యాంకుల్లో ఉన్నారు. శ్రీకాంత్ నాలుగు స్థానాలు కిందకు దిగి 32వ ర్యాంక్‌లో నిలిచాడు. విమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు 10వ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. విమెన్స్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని 19వ ర్యాంక్‌లో ఉండగా, ట్రీసా జాలీ–పుల్లెల గాయత్రి 24వ ర్యాంక్‌కు ఎగబాకారు.