గుంతల రోడ్డుపై సోషల్ మీడియాలో సెటైర్

గుంతల రోడ్డుపై సోషల్ మీడియాలో సెటైర్
  • ‘ఇదే డల్లాస్​ రోడ్’  టీఆర్​ఎస్​ సర్కార్​​పై ​యాప్రాల్​ వాసి సెటైర్

​హైదరాబాద్, వెలుగు: జీహెచ్​ఎంసీ ఎన్నికలప్పుడు చర్చకు వచ్చిన నేరెడ్​మెట్ ​డివిజన్​లోని యాప్రాల్ రోడ్ల వ్యవహారం ఆదివారం సోషల్​ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓ స్థానికుడు డ్యామేజ్ రోడ్ల ఫొటోలు, వీడియో ఒకటి ట్విట్టర్, యూట్యూబ్​లో పోస్ట్​చేశాడు. ‘డల్లాస్ సిటీ కావాలంటే మరోసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటూ సెటైర్ వేశాడు.ఈ రోడ్లపై గర్భవతులు ప్రయాణిస్తే.. ఫ్రీగా డెలివరీ అవుతుందని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు యాప్రాల్​లో తీర్చిదిద్దిన డల్లాస్ ఇదేనని అందులో చెప్పాడు.’ గ్రేటర్ ​ఎన్నికలప్పుడు ప్రచారానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లిని స్థానికులు నిలదీశారు. నో రోడ్​.. నో ఓట్​అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఎలక్షన్​ అయ్యాక తన సొంత ఖర్చులతో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చాడు. చెప్పి 3 నెలలైనా ఇంతవరకు పట్టించుకోకపోవడంతో స్థానికుడు ఇలా చేశాడు.