
సతీష్ మేరుగు, హృతికా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏయ్ బుజ్జీ నీకు నేనే’. కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ రాయడంతో పాటు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ నిర్మించాడు హీరో సతీష్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యాయి. సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. రీసెంట్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘చిన్న సినిమాలకు నేనెప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాను. ఇలాంటి సినిమాలకి మద్దతు ఇస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరిన్ని మంచి మూవీస్ రావడానికి అవకాశం ఉంటుంది.
అన్నీ తానై ఒక మంచి ప్రొడక్ట్ సిద్ధం చేసిన సతీష్‌కి ఆల్ ద బెస్ట్’ అన్నారు. సతీష్ మాట్లాడుతూ ‘ఔట్‌పుట్ చూసిన తర్వాత నేను పడిన కష్టం మరిచిపోయాను. అన్ని కమర్షియల్ అంశాలూ ఈ సినిమాలో ఉంటాయి’ అన్నాడు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.