జ్యోతిష్యం : పౌర్ణమి రోజు మీనరాశిలో చంద్రుడు, శని.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!

జ్యోతిష్యం : పౌర్ణమి రోజు మీనరాశిలో చంద్రుడు, శని.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సమయానుసారం గ్రహాలు రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలు ఏర్పరుస్తుంటాయి. అక్టోబర్ 6వ తేదీ .. ఆశ్వయుజమాసం పౌర్ణమి రోజున  . శని, చంద్రుడు  మీనరాశిలో కలిసి అశుభ యోగాన్ని సృష్టించనున్నాయి. సాధారణంగా చంద్రుడు భావోద్వేగాలు, మనసు, ప్రేమకు కారకుడుగా ఉండి తెలుపు రంగును సూచిస్తాయి. శని.. బాధ్యత, కర్మ, పరిమితులు, పరీక్షలు, ఆటంకాలకు కారకుడు.  నలుపు రంగును కలిగి ఉంటాడు. ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడటం వల్ల.. బంధాల్లో బలహీనత, ఆలోచనల్లో మార్పు, నిరాశ, ఆందోళన బాధలు ఉత్పన్నమవుతాయి.

శని, చంద్రుల కలయిక మూడు  రాశుల వారికి సవాలుగా మారనుంది. జాగ్రత్తగా లేకపోతే తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏ రాశులవారికి అశుభ ఫలితాలు ఉన్నాయో.. వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. 


కర్కాటక రాశి  : ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి .    శని, చంద్రుల కలయిక శుభప్రదం కాదు. ఈ యోగం వలన  ఈ రాశి వారికి  ఖర్చులు, నష్టాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిరాశ పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి పనిలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పై అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాలకు సంబంధించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఉపశమనం మరియు పరిహారాలు:  ఆక్టోబర్​ 6 వ తేది సాయంత్రం బియ్యం ఖీర్​ ను చంద్రుని ఎదుట ఉంచి నమస్కారం చేయండి.  రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి.. నల్ల నువ్వులు .. బెల్లాన్ని చెట్టు మొదట ఉంచండి.. దగ్గరలోని దేవాలయాన్ని సందర్శించండి. 


కుంభ రాశి : ఈ రాశి కి శని దేవుడు ఆధిపత్యం వహిస్తాడు. శని, చంద్రుల అశుభ యోగం కుంభ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి,  ఆరోగ్యం సహకరించదు. ఆర్థిక పరిస్థితి అస్సలు అనుకూలించదు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

ఉపశమనం మరియు పరిహారాలు:  అక్టోబర్​ 6 వతేది పౌర్ణమి రోజు 21 నిమిషాలు చంద్రుని కాంతిలో కూర్చొని ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అనుష్టానం చేసే వారు  ఆ మంత్రాన్ని జపం  చేయండి.   హనుమాన్ చాలీసాను ఏడుసార్లు పఠించి..  లక్ష్మీ దేవికి ఖీర్ సమర్పించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

మీన రాశి : మీనరాశి వారికి శని, చంద్రుల కలయిక మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఈ రాశి   ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటివరకు చకచకా జరిగిన పనులు కూడా అడ్డంకుల వల్ల ఆలస్యమవుతాయి. ఇతరులతో మాట పడాల్సి వస్తుంది. వైవాహిక జీవితం, భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

ఉపశమనం మరియు పరిహారాలు:  ఆశ్వయుజ పౌర్ణమి ( అక్టోబర్​ 6) రోజు సాయంత్రం ఆవునెయ్యితో 11 దీపాలు వెలిగించి.. బాల్కనీ.. ఇంటి ప్రదాన గుమ్మం దగ్గర ఉంచండి . విష్ణు సహస్రనామం లేదా శ్రీ హరి స్తోత్రం పారాయణం చేయండి. అంతా మంచే జరుగుతుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని   జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.