
హైదరాబాద్, వెలుగు: ఇంటి అలంకరణ వస్తువులను తయారీ చేసే సత్వా సుకున్ లైఫ్ కేర్ లిమిటెడ్ రైట్ ఇష్యూ ద్వారా రూ. 49.50 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపాదిత రైట్స్ ఇష్యూ కోసం కంపెనీ ఈ ఏడాది మార్చి 27న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందింది.
రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన నికర ఆదాయాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్అవసరాలను తీర్చడానికి, వ్యాపార విస్తరణకు, ఇప్పటికే ఉన్న అనుబంధ సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించడానికి వాడుతుంది. కొత్త అనుబంధ సంస్థలు లేదా అసోసియేట్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి కూడా కొంత డబ్బు కేటాయించవచ్చని సత్వా సుకున్ లైఫ్ కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రహ్మభట్ చెప్పారు.