సాత్విక్‌‌‌‌-చిరాగ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌.. ఇవాళ్టి( జులై 15) నుంచి జపాన్ ఓపెన్‌‌‌‌

సాత్విక్‌‌‌‌-చిరాగ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌.. ఇవాళ్టి( జులై 15) నుంచి జపాన్ ఓపెన్‌‌‌‌

టోక్యో: ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌‌‌‌, సాత్విక్ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్ షెట్టి మంగళవారం  నుంచి జరిగే జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్ టాప్ జోడీ  సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ టైటిల్ గెలిచి తమ నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం వరల్డ్15 ర్యాంక్‌‌‌‌లో ఉన్న సాత్విక్-–చిరాగ్ ద్వయంఈ సీజన్‌‌‌‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ టైటిల్ నెగ్గడం లేదు. 

ఈ టోర్నీ తొలి మ్యాచ్‌‌‌‌లో   కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్– కి డోంగ్ జు జోడీతో ఆడనుంది. మరోవైపు సింగిల్స్ స్టార్ ప్లేయర్లు  సింధు, లక్ష్య సేన్ ఈ టోర్నీతో అయినా తిరిగి ఫామ్ అందుకోవాలని చూస్తున్నారు. 18వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ లక్ష్య తన తొలి మ్యాచ్‌‌‌‌లో చైనా షట్లర్‌‌‌‌‌‌‌‌ వాంగ్ జెంగ్ జింగ్‌‌‌‌తో తలపడనున్నాడు. 16వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు తొలి రౌండ్ మ్యాచ్‌‌‌‌లో కొరియా ప్లేయర్ సిమ్ యు జిన్‌‌‌‌ను ఢీకొట్టనుంది. విమెన్స్ సింగిల్స్‌‌‌‌లో  ఉన్నతి హుడా, అనుపమ ఉపాధ్యాయ, రక్షిత రామ్‌‌‌‌రాజ్ కూడా బరిలో నిలవగా.. డబుల్స్‌‌‌‌లో కవిప్రియ–-సిమ్రాన్ సింఘి, రుతపర్ణ–-శ్వేతపర్ణ, మెన్స్ డబుల్స్‌‌‌‌లో హరిహరన్-–రుబన్ కుమార్ జోడీలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.