సింగపూర్: ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. సింగపూర్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో సంచలనం సృష్టించింది. శనివారం (మే 30) జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్‌లో నాలుగో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–19, 21–18తో వరల్డ్ నంబర్‌వన్ జోడీ, టాప్‌సీడ్ కిమ్ వాన్ హో–సియో సియోంగ్ జే (కొరియా)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
52 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ద్వయం పట్టువదలకుండా పోరాడారు. తొలి గేమ్ ఆరంభంలో కాస్త ఇబ్బందిపడ్డ సాత్విక్–చిరాగ్.. ప్రత్యర్థులకు పుంజుకునే చాన్స్ ఇచ్చారు. దాంతో కొరియా జోడీ 13–11తో ఆధిక్యంలో నిలిచింది. అయినప్పటికీ బలమైన స్మాష్‌లతో వరుసగా పాయింట్లు రాబట్టిన ఇండియన్ జోడీ కీలక టైమ్‌లో ఒత్తిడిని అధిగమించి గేమ్‌ను గెలిచారు.
రెండో గేమ్‌లోనూ సాత్విక్–చిరాగ్‌కు గట్టి పోటీ ఎదురైంది. 11–14తో వెనకబడినా నెట్ వద్ద సూపర్ డ్రాప్స్‌తో క్రమంగా పట్టు బిగించారు. ఆ తర్వాత క్రాస్ కోర్టు విన్నర్లపై కొరియా ప్లేయర్లపై ఆధిపత్యం చూపెట్టి గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. విమెన్స్ డబుల్స్ సెమీస్‌ల తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీ 16–21, 21–17, 13–21తో యుయిచి షిమోగా–సయాక హోబరా (జపాన్) చేతిలో ఓడింది.
