సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ జోడీకి సింగపూర్‌‌‌‌ టైటిల్‌.. రెండేళ్ల టైటిల్ ఆకలి తీరింది..!‌‌‌

సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ జోడీకి సింగపూర్‌‌‌‌ టైటిల్‌.. రెండేళ్ల టైటిల్ ఆకలి తీరింది..!‌‌‌

సింగపూర్‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్లు సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి జోడీ.. సింగపూర్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ఫైనల్లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ 18–21, 21–17, 21–16తో ఫజర్‌‌‌‌ అల్ఫియాన్‌‌‌‌–మహ్మద్‌‌‌‌ షోహిబుల్‌‌‌‌ ఫిక్రి (ఇండోనేసియా)పై గెలిచారు. దాంతో రెండేళ్ల టైటిల్‌‌‌‌ నిరీక్షణకు ఎట్టకేలకు తెర దించారు. సాత్విక్ జోడీ కెరీర్‌‌‌‌లో ఇది 9వ వరల్డ్‌‌‌‌ టూర్‌‌‌‌ సిరీస్‌‌‌‌ కాగా, మూడో సూపర్‌‌‌‌ 750 టైటిల్‌‌‌‌ కావడం విశేషం. 

అలాగే సింగపూర్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చరిత్రలో డబుల్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నెగ్గిన తొలి ఇండియన్‌‌‌‌ జోడీగానూ రికార్డులకెక్కారు. చివరిసారి 2024లో థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ గెలిచిన సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌.. ఆ తర్వాత నాలుగు టోర్నీల్లో ఫైనల్‌‌‌‌కు చేరినా రన్నరప్‌‌‌‌తోనే సరిపెట్టుకున్నారు. ఫజర్‌‌‌‌–ఫిక్రితో గంటా 13 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ తొలి గేమ్‌‌‌‌ ఓడినా.. తర్వాత రెండు గేమ్‌‌‌‌ల్లో తమ ట్రేడ్ మార్క్‌‌‌‌ ఆటను చూపెట్టారు.