Thailand Open: థాయ్‌లాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో భారత స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్‌శెట్టి అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. ఈరోజు (2026, మే16న) ఉత్కంఠభరితంగా కొనసాగిన సెమీ ఫైనల్ పోరులో మలేషియా జోడీ గో జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్‌పై 19–21, 22–20, 21–16 తేడాతో సాత్విక్ – చిరాక్ ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ సీజన్‌లో తొలి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న జోడీగా అవతరించింది.
ప్రపంచ నంబర్ 4 ర్యాంక్‌లో ఉన్న ఇండియన్ జోడీ 19–21, 22–20, 21–16 తేడాతో మలేషియాపై గెలిచింది. గంటా 22 నిమిషాల పాటు జరిగిన ఈ ఫైట్ లో సాత్విక్ – చిరాక్ జోడీ అద్భుత పోరాట పటిమ కనబరిచారు. ఈ గెలుపుతో మలేషియా జోడీపై తమ హెడ్-టు-హెడ్ రికార్డును 8-2కు పెంచుకుంది. పీవీ సింధు, లక్ష్యసేన్ ఇప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ.. భారత్ ఆశలన్నీ ఈ జోడీపైనే నెలకొన్నాయి.
కాగా తొలి సెట్‌ను మలేషియా ఆటగాళ్లు గో జెఫీ- నూర్ ఇజ్జుద్దీన్ 20–19 తేడాతో కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఇండియన్ జోడీ రెండో సెట్‌ను 22–20తో దక్కించుకుంది. మ్యాచ్‌ను తేల్చే మూడో సెట్‌లో గెలుపు కోసం ఇరు జట్లూ తీవ్రంగా కష్టపడ్డాయి. కానీ సాత్విక్– చిరాక్ జంట అద్భుతమైన ప్రదర్శనతో 21–16తో సెట్‌ను గెలిచి.. ఫైనల్‌కు దూసుకుపోయింది.
SATWIK & CHIRAG STORMS INTO FINALS! 🔥🤩pic.twitter.com/I3ADQoJO5V
— The Khel India (@TheKhelIndia) May 16, 2026
