ఎకానమీలో ఏఐ దూకుడు .. ఏఐతో  ప్రొడక్టివిటీ పెరుగుతుందని వెల్లడి

ఎకానమీలో ఏఐ దూకుడు .. ఏఐతో  ప్రొడక్టివిటీ పెరుగుతుందని వెల్లడి
  • 2025 నాటికి జీడీపీలో ఏఐ వాటా 10 శాతానికి చేరుకుంటుందన్న  మైక్రోసాఫ్ట్‌‌‌‌ సీఈఓ సత్య నాదెళ్ల
  • ఇండియాలో బోలెడు అవకాశాలు ఉన్నాయి

న్యూఢిల్లీ: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌ (ఏఐ) తో  ఇండియా  జీడీపీ 4 రెట్లు ఎక్కువ పెరుగుతుందని  మైక్రోసాఫ్ట్ సీఈఓ  సత్య నాదెళ్ల అంచనా వేశారు.  ఇండియా ఎకానమీ  2025 నాటికి  5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుందని, ఇందులో 10 శాతం వాటా అంటే 500 బిలియన్ డాలర్లు ఏఐ ద్వారా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ డేటా ఆధారంగా ఈ లెక్కలు వేశారు.  అలానే ఏఐ టెక్నాలజీపై రెగ్యులేషన్స్‌‌‌‌ను యూఎస్‌‌‌‌, ఇండియా కలిసి  తీసుకురావాలని పేర్కొన్నారు.

ఇండియాకు  వచ్చిన ఆయన ఇక్కడి బిజినెస్ లీడర్లు, మీడియాతో మాట్లాడారు.  ఏఐతో  ప్రొడక్టివిటీ పెరుగుతుందని, ఎకానమీ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. సాఫ్ట్‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, రిటైల్, హెల్త్‌‌‌‌కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో  ఏఐతో ప్రొడక్టివిటీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.  అందరిపైనా ప్రభావం చూపించే జనరల్‌‌‌‌ టెక్నాలజీని తాను ఎప్పుడూ చూడలేదని, ఇదే మొదటిసారని  అన్నారు.  ‘ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌, రిటైల్, ఎనర్జీ వంటి ప్రతీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో  ఏఐ వాడడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఇండియా తన ఎకానమీని ఏఐతో మెరుగుపరుచుకోవడంలో  మైక్రోసాఫ్ట్‌‌‌‌  సాయపడుతుంది. అన్ని సెక్టార్లు, ఎగుమతుల అవసరాలను తీర్చేందుకు   ఏఐ ప్రొడక్ట్‌‌‌‌లను క్రియేట్ చేశాం. అన్ని దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నాం’ అని సత్య నాదెళ్ల వివరించారు.  

కొత్త జాబ్స్‌‌‌‌ క్రియేట్ అవుతాయి..

ఏఐ వలన చాలా  మంది ఉద్యోగాలు కోల్పోతారని నాదెళ్ల ఒప్పుకున్నారు. కానీ, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని  అన్నారు. కొత్త స్కిల్స్‌‌‌‌ నేర్చుకోవడంలో ముందుండే వారికి మంచి అవకాశాలు దొరుకుతాయని, వీరి శాలరీ కూడా పెరుగుతుందని వెల్లడించారు. ‘డేటా లేబులింగ్‌‌‌‌ వంటి  కొత్త జాబ్స్ పుట్టుకొచ్చాయి. ఇవి రూరల్  ఇండియాకు కూడా విస్తరిస్తున్నాయి. మహిళల శాలరీస్‌‌‌‌ పెరిగాయి.

వీరు సాధారణ ఉద్యోగాలతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ జీతాన్ని ఏఐ జాబ్స్ ద్వారా పొందుతున్నారు’ అని నాదెళ్ల పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీకి  షిఫ్ట్ అవ్వడంలో ఇండియాలో పాలసీ సపోర్ట్‌‌‌‌ ఉందని, ఏఐ ప్రొడక్ట్‌‌‌‌లు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ బట్టి తమ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు ఆధారపడి ఉంటాయన్నారు.  లోకల్‌‌‌‌గా తమ సొంత డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నామని , ఇండియాలోని తమ ఉద్యోగుల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామని వెల్లడించారు. 

20 లక్షల మందికి స్కిల్స్‌‌‌‌..

 ఏఐపై 2025 నాటికి 20 లక్షల మందికి శిక్షణ ఇస్తామని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఉద్యోగుల స్కిల్స్‌‌‌‌ను మెరుగుపరచడంపై కంపెనీలు ఎక్కువ ఫోకస్ చేస్తాయని అన్నారు. రెన్యూవబుల్ సోర్స్‌‌‌‌ల నుంచి కరెంట్ ఉత్పత్తిని పెంచడంపై, గ్రిడ్ స్టెబిలిటీపై  ప్రభుత్వం ఫోకస్ పెడుతోం దని,  ఇందులో టెక్నాలజీ పాత్ర కీలకంగా ఉంటుందని  వెల్లడించారు. టాటా గ్రూప్‌‌‌‌ చైర్మన్ ఎన్‌‌‌‌ చంద్రశేఖరన్‌‌‌‌తో మాట్లాడానని, ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఏఐకి  వేగంగా షిఫ్ట్‌‌‌‌ అవుతోంద అన్నారు.

టికెట్‌‌‌‌ బుకింగ్‌‌‌‌లో కస్టమర్లకు సాయం చేసేం దుకు ‘ఏఐ ఏజెంట్‌‌‌‌’ ను ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా తీసుకొచ్చిందన్నారు. అలానే  ఐటీసీ,  అర్వింద్‌‌‌‌,  ఇన్ఫోసిస్‌‌‌‌, హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు  ఏఐ టూల్స్‌‌‌‌ను వాడుతున్నాయని అన్నారు. సైంటిఫిక్  రీసెర్చ్‌‌‌‌లో కూడా ఏఐ సాయపడు తుందని  వెల్లడించారు. ఎస్‌‌‌‌బీఐ చైర్మన్‌‌‌‌ దినేష్ ఖారాతో గురువారం బెంగళూరులో సమావేశమవుతానని నాదెళ్ల పేర్కొన్నారు.