జూన్ 9 వరకు సత్యేంద్ర జైన్ కస్టడీ

జూన్ 9 వరకు సత్యేంద్ర జైన్ కస్టడీ

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ కస్టడీకి కోర్టు అనుమతించింది. జూన్ 9 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించేందుకు అంగీకరించింది. కస్టడీ సమయంలో జైనుల ఆహారం అందించాలన్న సత్యేంద్ర జైన్ రిక్వెస్ట్ కు కోర్టు ఓకే చెప్పింది. అయితే రోజూ జైన్ టెంపుల్ కు వెళ్లేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. 

సత్యేంద్ర జైన్ కేసులో ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 2015, 2017 మధ్యకాలంలో సత్యేంద్ర జైన్ రూ.1.67 కోట్ల మేర అక్రమ ఆస్తులు సంపాదించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితుడు తన అక్రమ సంపాదనను హవాలా ద్వారా కోల్ కతాలోని షెల్ కంపెనీలకు తరలించినట్లు దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. ఆ డబ్బుతో సత్యేంద్ర జైన్ ఢిల్లీలో భూమి కొనుగోలు చేసినట్లు న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. తొలుత మంత్రిని అరెస్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని, కేవలం ప్రశ్నించేందుకే పిలిచామని అయితే ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం..

సత్తా చాటిన ఉమెన్స్.. షూటింగ్ వరల్డ్ కప్లో భారత్కు స్వర్ణం

మగాడినైతే బాగుండేది.. ఈ నొప్పి ఉండేది కాదు..